![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -646 లో..... జ్యోత్స్న మెడలో కార్తీక్ తాళి కట్టినట్లు కాంచనకి కల వస్తుంది. ఆ విషయం కార్తీక్ కి తెలిసి ఏంటి అమ్మా నాకు దీప ఉండగా జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటానా అని కార్తీక్ అంటాడు. ఆ డిస్కషన్ మొత్తం దీప విని ఏడుస్తూ వెళ్తుంది. ఏంటి అమ్మ నువ్వు నీకు ఏదో కల వస్తే దానికి ఈ పంచాయతీ పెట్టడం అవసరమా అని కాంచనతో కార్తీక్ అంటాడు. ఇప్పుడు నేను ఏం అన్నానురా అని కాంచన కోపంగా లోపలికి వెళ్తుంది. ఒక ఇంట్లో భార్యకి తల్లికి సర్ది చెప్పడం కష్టమని శ్రీధర్ అంటాడు. ఏ ఇంట్లో అయిన అత్తతో గొడవలు ఉంటాయి కానీ ఈ ఇంట్లో మాత్రం మామతో గొడవలు అవుతున్నాయి. మీరు మాటిమాటికీ రాకండి అని శ్రీధర్ తో కార్తీక్ అంటాడు.
ఎంత మాట అన్నావ్ రా ఈ గొడవ ఏంటో తెల్చేవరకు ఇక్కడ నుండి వెళ్ళనని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత దీప దగ్గరికి కార్తీక్ వెళ్తాడు. అమ్మకి ఏదో కల వస్తే నువ్వు ఎందుకు బాధపడడం దీప అని కార్తీక్ అంటాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న ఛాలెంజ్ చేసింది.. ఆ విషయం అత్తయ్యకి ఎలా తెలుస్తుంది. అత్తయ్యకి కల వచ్చింది అంటే అది నిజమే అయి ఉంటుందని దీప అంటుంది. ఇంత అనుమానం ఏంటే తల్లి అని కార్తీక్ అంటాడు. నువ్వు చేసుకున్నా చేసుకుంటావని దీప అంటుంటే ఆపే తల్లి ఆ జ్యోత్స్న ఒకవేళ ఇంటికి వచ్చిన పంపిస్తానని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న పారిజాతం, శివన్నారాయణ, సుమిత్ర దశరత్ ఇంటికి వస్తారు. అందరు వాళ్ళ చేతిలో తాంబులాలతో వస్తారు. నిజంగానే నాకు వచ్చిన కల నిజం అవుతుందా ఏంటీ వీళ్ళు సంబంధం మాట్లాడానికే వచ్చారా అని కాంచన భయపడుతుంది. దీప ఎక్కడ అని పారిజాతం అడుగుతుంది. పెరట్లో ఉన్నారని కాంచన అంటుంది. దాంతో నేను వెళ్లి తీసుకొని వస్తానని జ్యోత్స్న వెళ్తుంది. తను వెళ్లేసరికి కాంచనకి వచ్చిన కల గురించి మాట్లాడుకుంటారు. అది విని వాళ్లకి కన్పించకుండా వెనక్కి వచ్చి బావతో సరదాగా ఒక ఆట ఆడుతానని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ కి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. దాంతో వాళ్ళు వచ్చిన విషయం తెలియని దీప ఫోన్ తీసుకొని.. ఏంటి జ్యోత్స్న నీకు బుద్ది ఉందా డ్యూటీకి ఇంకా టైం ఉంది కదా అని కోప్పడుతుంది. జ్యోత్స్న స్పీకర్ లో పెట్టి మాట్లాడుతుంది. నేను ఏం అన్నాను దీప అని జ్యోత్స్న యాక్టింగ్ చేస్తుంది.
ఆ మాటలు అందరు విని షాక్ అవుతారు. వెంటనే పారిజాతం ఫోన్ తీసుకొని మేం మీ ఇంట్లో ఉన్నాం.. లోపలికి రండి అని అంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ ఆ జ్యోత్స్న స్పీకర్ లో పెట్టి ఉంటుందని కార్తీక్ అంటాడు. దీప కార్తీక్ హాల్లోకి వస్తారు. ఏంటి దీప.. నా కూతురు ఏం అంది బుద్ది ఉందా అంటున్నావని సుమిత్ర అంటుంది. సుమిత్ర అదంతా వదిలేయ్ అని పారిజాతం అంటుంది. మేం వచ్చిన విషయం ఏంటంటే దీప ప్రెగ్నెంట్ కదా తనకి సారె తీసుకొని వచ్చాము.. సుమిత్ర తల్లి స్థానంలో ఉండి అన్ని చెయ్యాలని పారిజాతం అంటుంది. దీప మాటలకి హర్ట్ అయిన సుమిత్ర ఇష్టం లేకుండానే దీపకి తల్లి స్థానంలో ఉండి సారె ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |